News January 9, 2025

తొక్కిసలాటకు కారణం అదే: టీటీడీ ఈవో

image

AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

Similar News

News December 4, 2025

ఆదిలాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్

image

ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుక హెలి ప్యాడ్‌లో ల్యాండ్ అయ్యారు. వెంటనే నేరుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

News December 4, 2025

చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

image

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

image

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.