News January 9, 2025
తొక్కిసలాటకు కారణం అదే: టీటీడీ ఈవో
AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
Similar News
News January 23, 2025
₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!
కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.
News January 23, 2025
మహా కుంభమేళా.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్ (UP) మహా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
News January 23, 2025
సీనియర్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన జమ్మూ పేసర్
ముంబైతో జరిగిన రంజీ మ్యాచులో జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ సీనియర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ(3), అజింక్య రహానే(12), శివమ్ దూబే(3), హార్దిక్ తామూర్(7)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపారు. వారు క్రీజులో ఏమాత్రం కుదురుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగారు. కాగా పుల్వామాకు చెందిన 31 ఏళ్ల ఉమర్ 2013 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. గతంలో ఇండియా-సి జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.