News June 30, 2024
భారత అభిమానులను వణికించిన ఆ ఓవర్

T20 WC ఫైనల్లో అక్షర్ వేసిన 15వ ఓవర్ అభిమానులకు చెమటలు పట్టించింది. అప్పటికి SA 36బంతుల్లో 54రన్స్ కొట్టాలి. 15వ ఓవర్‌లో క్లాసెన్ ఉతికి ఆరేశారు. 2సిక్సర్లు, 2ఫోర్లతో పాటు 2రన్స్ చేశారు. పైగా అక్షర్ 2వైడ్లు వేశారు. దీంతో మొత్తం 24రన్స్ వచ్చాయి. ఫలితంగా టార్గెట్ 30బంతుల్లో 30కి వచ్చేసింది. మ్యాచ్ IND చేజారిందని అనుకున్నారంతా. కానీ 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4రన్స్ ఇచ్చి మళ్లీ INDను రేసులోకి తెచ్చారు.
Similar News
News July 11, 2025
HCA అవకతవకలపై రంగంలోకి దిగిన ఈడీ

TG: HCA <<17021009>>అవకతవకల <<>>వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. HCA కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. FIR, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా HCAలో నిధుల గల్లంతు, నకిలీ పత్రాలతో జగన్మోహన్ ఎన్నిక, ప్లేయర్ల ఎంపికలో అవకతవకలు వంటి అభియోగాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
News July 11, 2025
జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా?

రిషభ్ పంత్ గాయంపై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమ్ ఇండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ వచ్చారు.
News July 11, 2025
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.