News March 4, 2025
ఆ ప్రెస్‌మీట్ సినిమాను దెబ్బతీసింది: బన్నీ వాసు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తండేల్’. ఈ చిత్రం ఈనెల 7న ఓటీటీలో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ సినిమాపై నిర్మాత బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘తండేల్ పైరసీకి గురైందని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పరోక్షంగా సినిమాను దెబ్బతీసింది. దానివల్లే పైరసీ అయిందని అందరికీ తెలిసింది. థియేటర్‌లో విజయవంతంగా నడుస్తున్నప్పుడు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది’ అని తెలిపారు.
Similar News
News March 24, 2025
వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్‌మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రైస్‌ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.