News December 20, 2024
అది మగతనం కాదు.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
రాహుల్ గాంధీపై BJP విమర్శల వేడి పెంచింది. MPలను తోయడం మగతనం అనిపించుకోదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఈ ఘటన నిలువరించదగినదని పేర్కొన్నారు. రాహుల్ బలవంతంగా తోసేసినా సంఖ్యా బలం ఉన్న BJP MPలు ప్రతిఘటించలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యాబలం సభ నడపడానికి, ఓటింగ్ కోసం ఉందన్నారు. విపక్షాల తీరు వల్ల అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు.
Similar News
News January 23, 2025
జైలు శిక్షపై స్పందించిన RGV
చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.
News January 23, 2025
వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ
AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
News January 23, 2025
సంజూపై కుట్ర పన్నుతున్నారు: తండ్రి
సంజూ శాంసన్‌ను బీసీసీఐ విచారించనుందన్న నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCA సంజూపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘6 నెలలుగా KCA కుట్రలు చేస్తోంది. అక్కడ నా బిడ్డ సురక్షితంగా లేడు. ప్రతిదానికి సంజూపై నిందలు వేస్తోంది. ప్రజలు కూడా వాటిని నమ్ముతున్నారు. అందుకే నా కొడుకు కేరళ తరఫున ఆడటం మానేయాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపారు.