News October 5, 2025
టాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడా అదే: రాశీ ఖన్నా

టాలీవుడ్‌లో హీరోయిన్లను చాలా గౌరవిస్తారని రాశీ ఖన్నా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న తేడాపై ఆమె మాట్లాడారు. ‘తెలుగులో షూటింగ్ రోజూ 9 గంటలే ఉంటుంది. హిందీ, తమిళ ఇండస్ట్రీలో 12 గంటలు పని చేయాలి. దీంతో అలసిపోతాం. నన్ను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువ ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది.
Similar News
News October 5, 2025
చర్మానికి మెరుపును తెచ్చే ‘చామంతులు’

చామంతి పూలు అలంకరణకే కాకుండా చర్మ సౌందర్యానికీ ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ముందుగా చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే నల్లమచ్చలు, మొటిమలు తగ్గి చర్మం కాంతిమంతంగా మారుతుంది.<<-se>>#SKINCARE<<>>
News October 5, 2025
16న శ్రీశైలానికి మోదీ.. కీలక ప్రతిపాదనలు!

AP: ప్రధాని మోదీ ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటికి రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, Dy.CM సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉంది. ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, నూ క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
News October 5, 2025
ECGCలో 25 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 5) ఆఖరు తేదీ. వయసు 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా www.nats.education.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://main.ecgc.in/