News December 5, 2024
అమ్మాయిలు అలాంటివాడినే ప్రేమిస్తున్నారు: షాహిద్

నేటి తరం అమ్మాయిలు కబీర్ సింగ్(తెలుగులో అర్జున్ రెడ్డి) వంటి అబ్బాయిల్నే ప్రేమిస్తున్నారని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కబీర్ పాత్రని నేను కచ్చితంగా ఇష్టపడను. కానీ అలాంటి వారు సొసైటీలో ఉన్నారు. ఆ పాత్ర చేసే అనేక పనులు ఆమోదయోగ్యం కాదు. అయితే, చాలామంది అమ్మాయిలు అలాంటి వాళ్లను ప్రేమిస్తున్నారు. అందుకే ఆ సినిమా చేశాం. చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
మీరెవరైనా ఆ టేస్ట్ చూశారా..?

90s కిడ్స్.. ఈ ప్రశ్న మీ కోసమే. ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని బ్యాటరీలు డ్రై అయ్యాయని ఎలా తెలుసుకుంటాం? మీకు ఐడియా ఉందా..? బ్యాటరీ చివరను నాలుకకు తగిలిస్తే ఒక రకమైన వగరు రుచి వస్తే అది పనిచేస్తుందని నిర్ధారించేస్తాం. బ్యాటరీ డెడ్ అయితే ఏమీ రాదు. మనలో చాలామంది ఈ టేస్ట్-టెస్ట్ రిజల్ట్ ఇచ్చినవాళ్లమే కదా. మీరు అప్పట్లో సైంటిస్టులా ఈ ప్రయోగం చేశారా? మీ మధుర జ్ఞాపకాలు కామెంట్ చేయండి.
News February 8, 2026
ఫోలిక్ యాసిడ్ అందరికీ అవసరమే

ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాక అందరికీ అవసరమేనంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఫోలిక్ యాసిడ్ వల్ల పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, చిక్కుడు జాతి గింజలు, పప్పులు, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా, మటన్ లివర్, బ్రౌన్ రైస్, పల్లీలు, పుట్టగొడుగులు, బొప్పాయి, క్యారెట్లు, బీట్ రూట్, పచ్చి బఠానీల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
News February 8, 2026
చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.


