News May 10, 2024
ధోనీ అందుకే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు: ఫ్లెమింగ్

CSK మాజీ కెప్టెన్ ధోనీకి కొత్త గాయమేమీ కాలేదని కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు. ‘IPL-2024 సీజన్ ముందు నుంచే ధోనీ కండరాల గాయంతో బాధపడుతున్నారు. అందుకే వర్క్‌లోడ్ తగ్గించేందుకు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కి పంపిస్తున్నాం. ఆయన ఫీల్డ్‌లో ఉంటే కొత్త కెప్టెన్‌కు విలువైన సలహాలు ఇస్తారు. అది మాకు చాలా ముఖ్యం. అందుకే రిస్క్ తీసుకోవట్లేదు’ అని చెప్పారు. గతేడాది ధోనీకి మోకాలి సర్జరీ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
Similar News
News November 7, 2025
DECలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్: మంత్రి కోమటిరెడ్డి

TG: రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ ద్వారా డిసెంబర్ 19-21 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ ఇటీవల ఆవిష్కరించారు.
News November 7, 2025
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై TG డైలమా

TG: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. దీనికి మద్దతివ్వాలా? లేదా అనే దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. BILLలోని డిస్కామ్‌ల ప్రైవేటీకరణ, అగ్రి ఇతర రంగాలకు సబ్సిడీల తగ్గింపు తదితరాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే నిధుల కేటాయింపు వంటి అంశాలూ ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. NOV 8లోగా అభిప్రాయాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
News November 7, 2025
అద్దెకు తాతా..బామ్మా..

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం అద్దెకు తాతయ్య, బామ్మ అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతినిస్తుంది. జపాన్‌లోని సిస్టం స్ఫూర్తితో ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.


