News May 4, 2024
అందుకే సినిమాలకు విరామం: షారుఖ్

పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో తన అభిమానుల్ని అలరించిన షారుఖ్ ఖాన్, ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుండటమే దీనిక్కారణమని ఆయన తాజాగా తెలిపారు. ‘గత ఏడాది చాలా బిజీగా ఉన్నాను. ఒళ్లు అలిసిపోయేలా కష్టించాను. అందుకే కొంత గ్యాప్ ఇచ్చాను. ఐపీఎల్‌లో కేకేఆర్ ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతానని టీమ్‌కు మాటివ్వడం కూడా ఓ కారణం. త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాను’ అని వెల్లడించారు.
Similar News
News February 7, 2026
మలేషియాకు బయలుదేరిన మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.
News February 7, 2026
T20 WC.. నేటి మ్యాచ్‌కు బుమ్రా దూరం!

T20 WCలో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరిగే <<19072262>>తొలి మ్యాచ్<<>>కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. నిన్న ఆయన గ్రౌండ్‌కు వచ్చినా ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు సుందర్ ఇంకా ఫిట్ కాకపోవడంతో భారత స్క్వాడ్‌లో 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.
News February 7, 2026
‘వందేభారత్’లో పేలుళ్లకు ప్లాన్.. కలకలం రేపిన లేఖ

TG: వందే భారత్ రైళ్లను పేల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఓ ఆగంతకుడు రైల్వే అధికారులకు లేఖ రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HYDలో ఉంటున్న నలుగురు జిహాదీలు వందేభారత్ ట్రైన్స్‌లో దాడులకు ప్లాన్ చేశారని అతను లేఖలో పేర్కొన్నాడు. దాదాపు 250 మందిని చంపాలని చూస్తున్నట్లు తెలిపాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ లేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


