News December 21, 2024
అందుకే పరామర్శించేందుకు వెళ్లలేదు: బన్నీ

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే తాను వెళ్లి స్వయంగా పరామర్శించానని అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పుడు తన అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. కానీ తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాల వల్లే వెళ్లలేకపోయానని, అందుకే నా సానుభూతి తెలియజేస్తూ వీడియో విడుదల చేశానని చెప్పారు. రేవతి మృతిపై ఎలా స్పందించాలనే దానిపై తాను ఇంకా పూర్తిగా క్లారిటీ తీసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
News November 18, 2025
ఏపీ అప్డేట్స్

* రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల.. ఇప్పటికే రూ.560 కోట్లు ఖాతాల్లో జమ చేశామని ప్రకటన
* రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు మంజూరు.. గురుకుల హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు రూ.3.06 కోట్లు
* పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని TTD పాలక మండలి సమావేశంలో నిర్ణయం
News November 18, 2025
లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

మైనర్పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.


