News October 21, 2024
అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

AP: నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. అయితే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ సభకు రావట్లేదన్నారు. అయితే ఈ సమావేశాలకు ఆయన వస్తారని వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
AP EAPCET రిజిస్ట్రేషన్లు షురూ

జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం ఉంటుంది. మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహిస్తారు.
News February 5, 2026
వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?

TG: వచ్చే వారంలో వరుసగా 3రోజులు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది.
News February 5, 2026
టెన్త్ స్టూడెంట్లకు సీజనల్ హాస్టళ్లు

AP: స్కూళ్లకు సరిగ్గా రాని టెన్త్ విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో 50 వసతి గృహాలను సోమవారం ప్రారంభించనుంది. స్థానిక టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను హాస్టళ్లకు తీసుకొస్తారు. అక్కడే వసతి, భోజనం సౌకర్యంతోపాటు ఉపాధ్యాయులతో తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తారు.


