News October 21, 2024
అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

AP: నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. అయితే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ సభకు రావట్లేదన్నారు. అయితే ఈ సమావేశాలకు ఆయన వస్తారని వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్‌తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65

ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 13, 2025
ఐబీలో 258 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 ACIO పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 16 ఆఖరుతేదీ. B.E./B.Tech/M.Tech ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/


