News March 28, 2024
అందుకే బాలీవుడ్ సినిమాలు చేయలేదు: త్రిష

బాలీవుడ్ సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను హీరోయిన్ త్రిష వెల్లడించారు. ‘నా కుటుంబాన్ని ముంబైకి మార్చడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌కి వెళితే దక్షిణాది చిత్రాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకున్న క్రేజ్ దృష్ట్యా హిందీ సినిమాలు వద్దనుకున్నా. అంతేకానీ నా తొలి హిందీ చిత్రం ‘కట్టామిఠా’ ఫెయిల్యూర్ వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదన్న ప్రచారం అవాస్తవం’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News February 11, 2026
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
News February 11, 2026
అమెరికా ‘మ్యాప్’ మాయ.. PoK పోస్ట్‌పై యూటర్న్!

PoK, ఆక్సాయ్ చిన్‌తో కలిపి మొత్తం J&Kను <<19072627>>భారత భూభాగం<<>>గా చూపిస్తూ చేసిన SM పోస్ట్‌ను అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్ (USTR) తొలగించింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ గతవారం USTR ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. దీంతో పాక్, చైనా ఆక్రమణలను తిరస్కరిస్తూ ఇండియా పొలిటికల్ మ్యాప్‌ను అమెరికా అధికారికంగా గుర్తించినట్లు అంతా భావించారు.
News February 11, 2026
గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.


