News November 27, 2024
షమీని అందుకే రిటెయిన్ చేసుకోలేకపోయాం: నెహ్రా
IPLలో తమ జట్టుకు గడచిన రెండు సీజన్లలోనే 48 వికెట్లు తీసిన షమీని గుజరాత్ టైటాన్స్ రిటెయిన్ చేసుకోలేదు. దీని వెనుక కారణాన్ని ఆ జట్టు హెడ్‌కోచ్ నెహ్రా వివరించారు. ‘షమీని రిటెయిన్ చేసుకోవాలనే అనుకున్నాం. కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది. వేలంలో ధర రూ.10 కోట్లకు చేరడంతో ఆ ధర మరీ ఎక్కువని భావించాం’ అని వెల్లడించారు. షమీని వేలంలో రూ.10 కోట్లకు SRH దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 11, 2024
వచ్చే ఏడాదిపై సమంత ఆసక్తికర పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది తనకు ఎలా ఉంటుందో చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. 2025లో చాలా బిజీగా ఉండటమే కాకుండా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారని అందులో ఉంది. ప్రేమను పంచే భాగస్వామిని పొందడంతో పాటు కొందరు పిల్లలు కూడా కలుగుతారని, మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని ఈ లిస్టులో ఉంది. దీంతో సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
News December 11, 2024
ప్రపంచంలో భారత ఫుడ్ టేస్ట్ ర్యాంకు ఎంతంటే…
ప్రపంచంలో అత్యంత రుచికరమైన ఆహారం కలిగిన 100 దేశాల్లో భారత్ 12వ స్థానాన్ని దక్కించుకుంది. టేస్ట్ అట్లాస్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అగ్రస్థానంలో గ్రీస్, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ ఆహారాలున్నాయి. భారత వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీ, అమృతసరీ కుల్చా, బటర్ గార్లిక్ నాన్, బటర్ చికెన్ రుచికరమైనవని టేస్ట్ అట్లాస్ స్పష్టం చేసింది.
News December 11, 2024
మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ
దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తదితరులు మోదీని కలిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వరకు 3 రోజులపాటు 40 నగరాల్లో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.