News December 16, 2024
షార్‌లో వందో రాకెట్ ప్రయోగం.. ఎప్పుడంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734306308947_893-normal-WIFI.webp)
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చే ఏడాది జనవరిలో ఇస్రో GSLV-F15 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది షార్ నుంచి చేపట్టే వందో రాకెట్ ప్రయోగం. దీనితో షార్ మరో మైలురాయిని చేరుకోబోతున్న సందర్భంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు రావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. 100వ రాకెట్ ప్రయోగం కావడంతో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
Similar News
News January 13, 2025
49 ఏళ్ల నటితో డేటింగ్ వార్తలు.. సింగర్ స్పందన ఇదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736774270169_695-normal-WIFI.webp)
ప్రముఖ నటి అమీషా పటేల్(49) పలు బ్రేకప్‌ల తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె ఇటీవల తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ దుబాయ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. ఆ రూమర్లను తాజాగా నిర్వాన్ ఖండించారు. ‘అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆమె తెలుసు. మ్యూజిక్ ఆల్బమ్ కోసం మేం దుబాయ్ వెళ్లాం’ అని పేర్కొన్నారు.
News January 13, 2025
యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736776856121_653-normal-WIFI.webp)
మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.
News January 13, 2025
నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736777401624_653-normal-WIFI.webp)
TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.