News October 21, 2024
సల్మాన్ఖాన్కు క్షమాపణ చెప్పిన నిందితుడు

రూ.5 కోట్లు డబ్బు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తామని <<14386537>>బెదిరించిన<<>> దుండగుడు ఇవాళ క్షమాపణ కోరాడు. ‘బెదిరింపు మెసేజ్ పంపి తప్పు చేశా. క్షమించండి’ అని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గతంలో వాడిన నంబర్ ద్వారానే ఝార్ఖండ్ నుంచి ఈ సందేశం వచ్చినట్లు తేలడంతో అక్కడికి సిబ్బందిని పంపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెదిరింపుల తర్వాత సల్మాన్ సెక్యూరిటీని భారీగా పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News October 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 29, 2025
హైదరాబాద్లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం ప్రారంభం

అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్ డొనాల్డ్స్కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్ప్రైస్ ఆపరేషన్స్కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.
News October 29, 2025
కందలో అంతర పంటలు.. అంతర పంటగా కంద

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.


