News October 21, 2024
సల్మాన్‌ఖాన్‌కు క్షమాపణ చెప్పిన నిందితుడు

రూ.5 కోట్లు డబ్బు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని <<14386537>>బెదిరించిన<<>> దుండగుడు ఇవాళ క్షమాపణ కోరాడు. ‘బెదిరింపు మెసేజ్ పంపి తప్పు చేశా. క్షమించండి’ అని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గతంలో వాడిన నంబర్ ద్వారానే ఝార్ఖండ్ నుంచి ఈ సందేశం వచ్చినట్లు తేలడంతో అక్కడికి సిబ్బందిని పంపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెదిరింపుల తర్వాత సల్మాన్ సెక్యూరిటీని భారీగా పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.

దశ మహావిద్యల గురించి మీకు తెలుసా?

వారణాసి గ్లింప్స్‌లో కనిపించిన ఛిన్నమస్తాదేవి దశ మహావిద్యల్లో ఒకరు. పరమేశ్వరుని ఆదిపరాశక్తి స్వరూపాన్ని 10 విభిన్న రూపాలుగా భావిస్తారు. వారినే ‘దశ మహా విద్యలు’ అని అంటారు. ముఖ్యంగా తంత్ర శాస్త్రం అభ్యసించేవారు ఈ దేవతా రూపాలను ఆరాధిస్తారు. ‘మహావిద్య’ అంటే మాయను ఛేదించి, పరమాత్మ తత్వాన్ని తెలియజేసే గొప్ప జ్ఞానం అని అర్థం. ఈ రూపాలు విశ్వంలోని సృష్టి, స్థితి, లయ వంటి పది ప్రధాన శక్తులను సూచిస్తాయి.