News September 11, 2024

గుండెపోటుతో నటుడు మృతి.. డాక్టర్ల కీలక సూచన

image

గుండెపోటుతో <<14054288>>మరణించడానికి<<>> ముందు నటుడు వికాస్ సేథికి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో ఛాతీలో నొప్పి లేకుండా కేవలం జీర్ణ సమస్యలతో గుండెపోటు వస్తుందా? అనే అంశం చర్చనీయాంశమైంది. వైద్యులు స్పందిస్తూ.. ‘8-33% గుండెపోటు కేసుల్లో ఛాతినొప్పి ఉండకపోవచ్చు. కడుపునొప్పి, వికారం, వాంతుల లక్షణాలు ఉంటాయి. షుగర్, BP, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ECG చేయించి చికిత్స తీసుకోవాలి’ అని తెలిపారు.

Similar News

News October 13, 2024

విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం

image

ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్ర‌త్త‌ప‌డుతోంది. హెజ్బొల్లా పేజ‌ర్ల పేలుళ్ల త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా ఇరాన్ విమాన‌యాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్ర‌యాణికులు మొబైల్ ఫోన్లు మిన‌హా పేజ‌ర్లు, వాకీటాకీల‌ను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్ల‌లేరు. దుబాయ్ నుంచి వ‌చ్చి, వెళ్లే విమానాల్లో స‌హా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.

News October 13, 2024

ప్రభుత్వానిదే బాధ్యత.. సిద్దిఖీ హత్యపై రాహుల్

image

MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హ‌త్య‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యుల‌కు సానుభూతిని ప్ర‌క‌టించారు. ఈ హ‌త్య ఘ‌ట‌న MHలో శాంతిభ‌ద్ర‌త‌ల క్షీణ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.

News October 13, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు వాగులు, కాలువలు పొంగే అవకాశం ఉందని, పిడుగులు పడొచ్చని తెలిపింది. రైతులు, గొర్రెలకాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసరమైతే 1070, 112, 1080-425-0101 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.