News November 23, 2024
56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146

సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్కు ఇన్స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.
Similar News
News November 21, 2025
తిరుమల: సర్వదర్శనానికి 8 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 66,839 మంది దర్శించుకోగా, 19,220 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 21, 2025
విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.
News November 21, 2025
బిజినెస్ కార్నర్

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.


