News November 23, 2024
56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146
సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌కు ఇన్‌స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.
Similar News
News December 7, 2024
ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా: బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షోలో హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్‌గా చేస్తానని చెప్పారు. ఈ షోకు నవీన్ పొలిశెట్టి, శ్రీలీల అతిథులుగా రాగా వారితో సరదాగా సంభాషించారు. మరోవైపు తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్ చెప్పారు. తన ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే అని, తాను మాత్రం నటనను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
News December 7, 2024
BGTలో షమీ ఆడటం కష్టమే!
BGTలో భారత పేసర్ షమీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతనికి NCA నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణం. అతను టెస్టుల్లో బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నారా లేదా అనే దానిపై NCA టీమ్ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. అతడిని AUSకు పంపకపోవచ్చని, పంపినా చివరి టెస్టులో మాత్రమే ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం SMAT T20లో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. ఎల్లుండి చండీగఢ్‌తో బెంగాల్ ప్రీ QF ఆడనుంది.
News December 7, 2024
పుష్ప-2: రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు
‘పుష్ప-2’ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మైల్‌స్టోన్‌ను అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించిందని తెలిపింది. తొలి రోజు రూ.294కోట్ల కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు గంటకు లక్షకుపైగా అమ్ముడవడం గమనార్హం. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.