News June 21, 2024

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం: సీతక్క

image

TG: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థుల దుస్తులు మహిళా సంఘాలే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15నాటికి విద్యార్థులకు రెండో జత స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. అటు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళాశక్తి క్యాంటీన్లు సైతం స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని మంత్రి అన్నారు.

Similar News

News September 13, 2024

సైబర్ మోసం.. రూ.45 లక్షలు పోగొట్టుకున్న నటుడు

image

సైబర్ నేరాల గురించి రోజూ వింటున్నా కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బిష్ణు అధికారి రూ.45 లక్షలు పోగొట్టుకున్నారు. యూట్యూబ్‌లో ఇచ్చిన టాస్కులు పూర్తిచేస్తే డబ్బులు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఇతడిని నమ్మించారు. ఇందుకోసం తొలుత కొంత మనీ ఇవ్వాలనడంతో పలు అకౌంట్లలో జమ చేశారు. చివరికి మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను స్వీయదర్శకత్వంలో హిట్ మ్యాన్‌ అనే మూవీని తీశారు.

News September 13, 2024

తొలి మంకీపాక్స్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

image

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియన్ నార్డిక్ సంస్థ తయారుచేసిన MVA-BN వ్యాక్సిన్‌‌ను వాడొచ్చని తెలిపింది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతవారం మంకీపాక్స్‌తో 107 మంది మరణించగా 3,160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది.

News September 13, 2024

ఐసెట్: తొలి విడతలో 30,300 సీట్లు భర్తీ

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. రెండు కోర్సుల్లో 34,748 సీట్లు ఉండగా 30,300 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 17లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.