News March 29, 2024

మహిళా క్రికెటర్‌పై బీజేపీ శ్రేణుల మండిపాటు

image

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీ పెట్టినట్లు ట్వీట్లు చేస్తున్నాయి. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు ఆమె ఇన్‌స్టా హ్యాక్ అయి ఉండొచ్చని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

Similar News

News March 13, 2026

ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

image

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <>annadathasukhibhava.ap.gov.in/<<>>లో చెక్ చేసుకోవచ్చు.

News March 13, 2026

పంత్ మరో అభిషేక్ అవుతాడా?

image

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

News March 13, 2026

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.