News October 6, 2024
యానిమేషన్ సినిమాకు ₹14,002 కోట్ల వసూళ్లు

ఓ యానిమేషన్ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. నవ్వులు, జీవిత పాఠాలు, జీవితాంశాల ఆధారంగా తెరకెక్కిన Inside Out-2 ప్రపంచ వ్యాప్తంగా ₹14,002 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది. పిక్సర్ యానిమేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కెల్సీ మన్ దర్శకుడు. హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్‌లో రిలే పాత్రకు బాలీవుడ్ నటి అనన్య పాండే డబ్బింగ్ చెప్పారు.
Similar News
News March 6, 2025
బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నైరాశ్యం!

KNR-ADB-NZB-MDK జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలను కైవసం చేసుకుని BJP జోష్‌లో ఉంది. రాష్ట్ర నేతలు సమష్టి కృషితో అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయి INC నైరాశ్యంలో పడిపోయిందని సమాచారం. అక్కడ ఏడుగురు మంత్రులు, 23 మంది MLAలు ఉన్నా అంతర్గత కలహాలు కొంపముంచాయని తెలుస్తోంది.
News March 6, 2025
ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 6, 2025
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.