News November 19, 2024
బంతి తగిలి అంపైర్‌కు తీవ్రగాయాలు

ఆస్ట్రేలియాలో జరిగిన ఓ థర్డ్ గ్రేడ్ మ్యాచ్‌లో బంతి తగిలి అంపైర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పెర్త్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో బ్యాటర్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టడంతో బంతి నేరుగా అంపైర్ టోనీ డీనోబ్రెగా ముఖానికి తగిలింది. కన్ను, పెదవులతోపాటు చెంప కూడా వాచిపోయింది. ఆయన కన్ను పూర్తిగా మూసుకుపోయింది. ప్రస్తుతం టోనీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 16, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>


