News December 6, 2024

ఒకే రోజు ముగ్గురు స్టార్ క్రికెటర్ల బర్త్ డే

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వారికి విషెష్ చెబుతున్నారు. కాగా బుమ్రా, జడేజా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నారు. ఈ టూర్‌కు అయ్యర్ ఎంపిక కాలేదు. అయ్యర్ ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తున్నారు. కాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు కరుణ్ నాయర్, ఆర్పీ సింగ్ బర్త్‌ డేలు ఇవాళే కావడం విశేషం.

Similar News

News March 14, 2026

IPLలో ఆడనున్న ముజరబాని.. పాక్ బోర్డు లీగల్ యాక్షన్!

image

PSL కాంట్రాక్ట్‌‌ను <<19375126>>వదులుకొని<<>> IPLలో KKR తరఫున ఆడటానికి సిద్ధమైన ముజరబాని(ZIM)పై లీగల్ యాక్షన్‌కు పాక్ క్రికెట్ బోర్టు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో ఇస్లామాబాద్ టీమ్ నుంచి తప్పుకోవడాన్ని సవాల్ చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ తొలుత పెషావర్ జల్మీ డైమండ్ జట్టులో చేరి తర్వాత MI టీమ్‌కు షిఫ్ట్ అయ్యారు. కాగా PSL మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.

News March 14, 2026

హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

image

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.

News March 14, 2026

గ్యాస్ బుక్ అయినా నో డెలివరీ! మీకూ ఈ సమస్య ఉందా?

image

వంటగ్యాస్ ఇబ్బందులు తప్పట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్యాస్ బుక్ అయినా OTP రావట్లేదని, సిలిండర్ డెలివరీ కావట్లేదని వాపోతున్నారు. 4-5 రోజులుగా ఎదురుచూస్తున్నా స్పందన లేదంటున్నారు. కాగా కొందరు ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ తెచ్చుకుంటున్నారు. మరి గ్యాస్ బుకింగ్, డెలివరీలో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి.