News March 30, 2024

పెళ్లైన కొన్ని గంటల్లోనే వధువు మృతి

image

AP: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ నవ వధువు మృతిచెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డలో జరిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో అఖిల (20) వివాహం జరిగింది. ఆ తర్వాత నీరసంగా ఉందంటూ నిద్రపోయారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.

Similar News

News January 26, 2025

BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

image

TG: అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. HYDలోని డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.

News January 26, 2025

రోజా.. ఐదేళ్లు రాష్ట్రానికి మీరేం చేశారు?: మంత్రి దుర్గేశ్

image

AP: Dy CM పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. ‘పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని వల్ల పర్యాటక శాఖ నష్టపోయింది’ అని విమర్శించారు.

News January 26, 2025

పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్

image

TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.