News August 8, 2024

బ్ర‌ిడ్జి వేశారు.. రోడ్డు విస్త‌ర‌ణ మ‌రిచారు!

image

బిహార్‌లోని అరారియా జిల్లాలో పంట పొలాల మ‌ధ్య ఉన్న ఓ బ్ర‌ిడ్జి వైరల్ అవుతోంది. ప‌రమానంద్పూర్ గ్రామంలో ఇంకిపోయిన న‌ది మీద రోడ్డు నిర్మాణానికి అధికారులు ముందుగా కొంత ప్రాంతాన్ని మాత్ర‌మే సేక‌రించి వంతెన నిర్మించారు. తీరా రోడ్డు విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన భూమి సేక‌రించ‌కుండా వదిలేశారు. దీంతో పంట‌పొలాల మ‌ధ్య బ్రిడ్జి ఎందుకుందంటూ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

Similar News

News September 8, 2024

రూల్ ఆఫ్ లాపై బీజేపీకి నమ్మకం లేదు: రాహుల్‌

image

BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ‌లు చేయాల్సిన వారే వాటిని తుంగ‌లో తొక్కుతున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. యూపీలో మంగేష్ యాద‌వ్ అనే యువ‌కుడిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయడంపై ఆయ‌న స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి న‌మ్మ‌కం లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసింద‌న్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమ‌ర్శించారు.

News September 8, 2024

PARALYMPICS: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.

News September 8, 2024

సెప్టెంబర్ 08: చరిత్రలో ఈ రోజు

image

1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
1933: బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే జననం
1936: మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి జననం
1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ జననం
1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
1999: టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
2020: టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం