News November 3, 2024
ఈ సినిమా బడ్జెట్ రూ.3వేల కోట్లు!

సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్ 8’ మూవీకి భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని $400 మిలియన్ల(దాదాపు రూ.3వేల కోట్లు)తో నిర్మించినట్లు సినీవర్గాల సమాచారం. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025, మే 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, పాన్ ఇండియా హీరోల సినిమా బడ్జెట్ కూడా రూ.500 కోట్లు దాటుతుండటం గమనార్హం.
Similar News
News October 20, 2025
దీపావళి.. లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.
News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
News October 20, 2025
దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టమట

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.