News November 3, 2024

ఈ సినిమా బడ్జెట్ రూ.3వేల కోట్లు!

image

సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్ 8’ మూవీకి భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని $400 మిలియన్ల(దాదాపు రూ.3వేల కోట్లు)తో నిర్మించినట్లు సినీవర్గాల సమాచారం. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025, మే 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, పాన్ ఇండియా హీరోల సినిమా బడ్జెట్ కూడా రూ.500 కోట్లు దాటుతుండటం గమనార్హం.

Similar News

News December 6, 2024

పుష్ప-2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

పుష్ప-2 సినిమాకు తొలిరోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. ALL TIME RECORD అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.

News December 6, 2024

MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం

image

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను MSPతో కొనేందుకు మోదీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్ప‌త్తుల‌ ఖ‌ర్చులో 50% రైతుల‌కు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ అవ‌స‌రం లేకుండా రైతుల ఆదాయం పెంపు, న‌ష్టాల స‌మ‌యంలో ప‌రిహారం వంటి చ‌ర్య‌ల‌తో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.

News December 6, 2024

12వేల ఏళ్ల క్రితమే కుక్కలతో మనిషి బంధం: అధ్యయనం

image

కుక్కలు, మనుషుల మధ్య బంధం 12వేల ఏళ్ల క్రితమే ఉందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాస్కాలో లభించిన 12వేల ఏళ్ల నాటి కుక్కల కాలి ఎముకలపై వారు అధ్యయనం నిర్వహించారు. వాటి ఎముకల్లో సాల్మన్ చేప ప్రొటీన్లు లభ్యమయ్యాయి. నాటి కుక్కలు భూమిపైనే వేటాడేవి తప్పితే సాల్మన్ చేపల్ని పట్టుకోవడం కష్టమని.. కచ్చితంగా అవి మనుషులతో కలిసి జీవించినవేనని పరిశోధకులు తేల్చారు.