News November 4, 2024
లోయలో పడిన బస్సు.. 36కు చేరిన మృతులు
ఉత్తరాఖండ్ అల్మోరాలోని మార్చుల వద్ద లోయలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరుకుంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. NDRF, SDRF, స్థానిక పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, సీఎం పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Similar News
News December 6, 2024
పెళ్లికి ముందే ఈ పరీక్షలు అవసరం!
ప్రాణాంతక తలసేమియా వ్యాధి నుంచి పిల్లల్ని రక్షించడానికి పెళ్లికి ముందే కాబోయే దంపతులు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు! తల్లిదండ్రులిద్దరికీ ఈ సమస్యలుంటే పిల్లలకూ సంక్రమించే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. మేనరిక వివాహాల వల్ల అత్యధికంగా సంక్రమించే ఈ వ్యాధి నుంచి పిల్లల రక్షణకు పెళ్లికి ముందే పరీక్షలు అవసరమని చెబుతున్నారు.
News December 6, 2024
పుష్ప-2.. తగ్గేదేలే
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా తొలి రోజు హిందీలో రూ.72కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పోస్టర్ విడుదల చేసింది.
News December 6, 2024
పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.