News July 2, 2024

లోకేశ్‌ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు

image

HYDలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతిలో AP మంత్రి నారా లోకేశ్‌కు పలువురు AP క్యాబ్ డ్రైవర్లు విన్నవించుకున్నారు. ఉమ్మడి రాజధానిగా HYD కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలకు TG ప్రభుత్వం మళ్లీ లైఫ్ ట్యాక్స్ అడుగుతోందని వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి APలో ట్యాక్స్ కట్టిన తమకు మళ్లీ కట్టడం ఆర్థికంగా తీవ్ర భారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న జరిగే చంద్రబాబు-రేవంత్ భేటీలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

Similar News

News October 12, 2024

కేసీఆర్ ఇంట దసరా వేడుకలు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి, కుమారుడు, కోడలు, మనుమరాలుతో గులాబీ దళపతి వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన మనుమడు హిమాన్షు అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తొలిసారిగా కుటుంబం దగ్గర లేకుండా దసరా చేసుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన తమ అధినేత ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

News October 12, 2024

సంజూ శాంసన్ సూపర్ సెంచరీ

image

ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.

News October 12, 2024

భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి ఆదేశాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.