News October 7, 2024
డిజిటల్ హెల్త్ కార్డులపై ఆ ప్రచారం అవాస్తవం: ప్రభుత్వం

TG: ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి తెలుగులో దరఖాస్తు ఫామ్ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. కార్డుల డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తుల ఫామ్‌ను రిలీజ్ చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఫేక్ దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Similar News
News January 15, 2026
ఇకపై గ్రోక్‌లో బికినీ ఫొటోలు రావు!

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
News January 15, 2026
రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. కథలు, కంటెంట్, కొత్త ఆలోచనలపై చర్చలు కొనసాగినట్లు PKCW వెల్లడించింది. బలమైన, అర్థవంతమైన కథలను అందించడమే లక్ష్యమని విశ్వప్రసాద్ తెలిపారు.
News January 15, 2026
మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


