News November 18, 2024

మ‌హారాష్ట్ర‌లో నేటితో ప్ర‌చార ప‌ర్వానికి తెర‌

image

MH అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సోమ‌వారంతో తెర‌ప‌డ‌నుంది. మొత్తం 288 స్థానాలకు బుధ‌వారం (Nov 20) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలో 9.7 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 4.93 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మ‌హిళలు ఉన్నారు. అధికార మ‌హాయుతి, విప‌క్ష MVA కూట‌ముల్లోని 6 పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. MNS, MIM, VBA పార్టీలు ఇతరుల ఓట్ల‌కు గండికొట్టే ఛాన్స్ ఉంది. 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

Similar News

News December 9, 2024

ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.

News December 9, 2024

మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మ‌మ‌త

image

భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్ర‌మించుకుంటామ‌ని కొంద‌రు బంగ్లా రాజ‌కీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్‌, ఒడిశా, బిహార్‌ల‌ను ఆక్ర‌మించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింస‌కు గుర‌వుతుండ‌డంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు.

News December 9, 2024

ధ‌న్‌ఖఢ్‌పై విప‌క్షాల అవిశ్వాస తీర్మానం!

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జగదీప్ ధ‌న్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని విప‌క్ష ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించాయి. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న స‌భ‌ను న‌డుపుతున్న తీరుపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంత‌కాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.