News August 30, 2024

గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్ వీడియోల కేసు.. UPDATE

image

AP: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ <<13972426>>కాలేజీ<<>> కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతోందని ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. బాధ్యులైన విద్యార్థిని, విద్యార్థి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసి ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ఏ చిన్న మెటీరియల్, వీడియో గాని ఉన్నా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా వీడియో రికార్డింగ్స్ ఫోన్లలో ట్రాన్స్‌ఫర్ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు.

Similar News

News January 31, 2025

తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఊపిరిలూదారు: సీఎం రేవంత్

image

TG: గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులు అర్పించారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక ఆయన అని స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.

News January 31, 2025

తెలుగు నిర్మాత కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్(54) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన HYDలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్న వేదరాజు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్‌తో మడత కాజా, సంఘర్షణ చిత్రాలను నిర్మించారు. మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.

News January 31, 2025

పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై SEC కీలక ఆదేశాలు

image

TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది.