News October 2, 2024
నీరజ్ చోప్రాకు గుడ్ బై చెప్పిన కోచ్

జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఆయన కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్ బంధం ముగిసింది. 75 ఏళ్ల క్లాస్ ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు స్వదేశం జర్మనీకి పయనమయ్యారు. ఆయన గతంలోనే వెళ్లిపోదామనుకున్నప్పటికీ రిక్వెస్ట్ చేసి ఆపామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈసారి మాత్రం వెళ్లడానికే నిర్ణయించుకున్నారన్నారు. నీరజ్ 2సార్లు ఒలింపిక్ మెడల్ గెలవడం వెనుక క్లాస్ కీలక పాత్ర పోషించారు.
Similar News
News September 13, 2025
SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.
News September 13, 2025
ఇంగ్లండ్.. హయ్యెస్ట్ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్!

ఫార్మాట్ ఏదైనా అత్యధిక స్కోర్లు నమోదు చేయడం ఇంగ్లండ్‌కు చాలా మామూలు విషయం అని చెప్పవచ్చు. వన్డేల్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు (498/4 vs NED, 481/6 vs AUS, 444/3 vs PAK) ఆ జట్టు పేరిటే ఉంది. టెస్టుల్లో శ్రీలంక (952/6 vs IND) తర్వాత రెండో అత్యధిక స్కోర్ కూడా ENG పేరు మీదనే (903/7d vs AUS) నమోదైంది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ (304/2vsSA) చేసింది కూడా ఇంగ్లండే.
News September 13, 2025
మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.