News March 23, 2025
కూటమి సర్కార్ నాపై కక్షగట్టింది: విడదల రజిని

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2025
నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

మహారాష్ట్ర Dy.CM ఏక్నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్కు షాక్?

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనెజువెలా నుంచి చమురును కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తోందని వివరించారు. వెనెజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.
News March 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.