News March 23, 2025
కూటమి సర్కార్ నాపై కక్షగట్టింది: విడదల రజిని

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.
Similar News
News April 22, 2025
నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌కు పాక్ అథ్లెట్!

ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో బెంగళూరులో JSW స్పోర్ట్స్ ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయబోతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జావెలిన్ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ని కూడా ఆహ్వానించినట్లు నీరజ్ తెలిపారు. కోచ్‌తో మాట్లాడి కన్ఫార్మ్ చేస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.
News April 22, 2025
నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే

ప్రతి ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డే నిర్వహిస్తారు. 1970లో ఇదే రోజున USAలో దాదాపు 2 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పర్యావరణానికి జరుగుతున్న హానిపై నిరసన తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేను నిర్వహిస్తున్నారు. ‘భూమి మానవుడిది మాత్రమే కాదు. సకల జీవరాశులకు నిలయమని గుర్తుంచుకుందాం. అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్స్‌లా మార్చేసి జంతువుల గూడును చెరపొద్దు’ అని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.
News April 22, 2025
‘ఆస్కార్-2026’ డేట్ వచ్చేసింది.. కీలక మార్పులివే?

98వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను 2026లో మార్చి 15న నిర్వహించనున్నట్లు అకాడమీ తెలిపింది. ఎలిజిబిలిటీ గైడ్‌లైన్స్, నామినేషన్స్, ఓటింగ్‌లో నిబంధనలు సవరించినట్లు పేర్కొంది. ఇక నుంచి ఓట్ వేయాలంటే నామినేట్ అయిన సినిమాను అకాడమీ సభ్యులు కచ్చితంగా వీక్షించాలి. ఫైనల్ బ్యాలెట్‌లో నామినీలందరినీ చూపిస్తారు. AIని వాడిన మూవీస్‌నూ అనుమతించనున్నారు. అయితే హ్యూమన్ క్రియేటివిటీకే ప్రాధాన్యమిస్తామని తెలిపారు.