News September 7, 2024
మహాభారతం రాసేందుకు వినాయకుడు విధించిన షరతు ఏంటంటే..!

మహాభారతాన్ని వేదవ్యాసుల వారు బోధించగా వినాయకుడు రాసినట్లు పురాణ ప్రశస్తి. అయితే.. రాసేందుకు గణేశుడు ఓ షరతు విధించినట్లు కథనం ఉంది. దాని ప్రకారం.. రాయడానికి తనకు అంగీకారమేనని, కథ మొత్తం ఏకధాటిగా చెప్పాలని ఆయన షరతు పెట్టాడట. వ్యాసులవారు చెప్పడం ఆగితే తాను కూడా రాయడం ఆపేస్తానని అనడంతో ఏకధాటిగా మూడేళ్ల పాటు వ్యాసుల వారు భారతాన్ని వినిపించారని ఓ కథనం.
Similar News
News December 15, 2025
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.
News December 15, 2025
ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
News December 15, 2025
పీరియడ్స్ నొప్పికి కారణాలు

పీరియడ్స్ నొప్పికి హై-లెవెల్ ప్రోస్టాగ్లాండిన్స్, యుటెరస్ వంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరగడం, గర్భాశయంలో నాన్-క్యాన్సర్ ఫైబ్రాయిడ్ల పెరుగుదల, అడెనోమైయోసిస్, అంటే యుటెరస్ లైనింగ్ కండరాల గోడపై దాడి చేసి నొప్పికి దారితీస్తుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్లు పీరియడ్స్ నొప్పిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


