News November 28, 2024

లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్

image

AP: విజయవాడ గన్నవరం రోడ్డులో నిలిపిఉన్న లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలాసేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్‌లో చూడగా డ్రైవర్ విలవిల్లాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGHకు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Similar News

News December 10, 2025

బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

News December 10, 2025

తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

image

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 10, 2025

పిల్లాడి ఆత్మహత్యతో AUSలో SM అకౌంట్లు క్లోజ్!

image

ఆస్ట్రేలియాలో నేటి నుంచి <<18509557>>16<<>> ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించలేరు. అయితే దీని వెనుక 14 ఏళ్ల బాలుడు ఆలివర్ ఆత్మహత్య ప్రధాన కారణం. ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే డిసీస్‌తో ఆలివర్.. SM ప్రభావంతో బరువు తగ్గి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఆలివర్ తల్లి ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌కి లేఖ రాయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది.