News May 4, 2024

ఈ లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్ల పైమాటే: CMS

image

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుకు లిమిట్ ఉంది కానీ పార్టీలకు లేదు. 2019 ఎన్నికల్లో BJP ₹1,264 కోట్లు, INC ₹820 కోట్లు వ్యయం చేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి పార్టీలు, అభ్యర్థులు చేసిన ఖర్చు ₹60,000 కోట్లు పైనేనని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్(CMS) నివేదిక వెల్లడించింది. ఈ LS ఎన్నికల్లో అనధికార ఖర్చు ₹1.2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఒక్కో సెగ్మెంట్ సగటు వ్యయం ₹221 కోట్లు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 18, 2026

చంద్ర దోష నివారణకు నేడు సువర్ణవకాశం..

image

అమావాస్య నాడు చంద్రకళలు క్షీణించి ఉంటాయి. అందుకే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి మానసిక అశాంతి కలుగుతుంది. దీని నివారణకు చొల్లంగి అమావాస్య సరైన రోజని జ్యోతిషులు చెబుతున్నారు. ‘తెల్లని వస్త్రంలో బియ్యం, చిన్న వెండి చంద్రుని ప్రతిమను పెట్టి, తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సాయంత్రం వేళ ప్రవహించే నదీ జలాల్లో ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని, తెల్లని పూలను విడిచిపెట్టాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

image

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్‌లో వేసి ఆస్ట్రోనాట్స్‌తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <>క్లిక్<<>> చేయండి.

News January 18, 2026

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదరగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.