News November 8, 2024

ఈ కేక్ ముక్క ఖరీదు అక్షరాలా రూ.2.40 లక్షలు

image

క్వీన్ ఎలిజబెత్-2 వివాహం నాటి కేక్ ముక్కను వేలం వేయగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో స్కాట్లాండ్‌కు చెందిన మారియన్ పోల్సన్ దానిని రూ.2.40 లక్షలకు కొన్నాడు. కాగా ఎలిజబెత్-ఫిలిప్ పెళ్లి 1947లో జరిగింది. అప్పటి నుంచి ఆ కేక్ పీస్‌ను భద్రంగా ఫ్రిడ్జ్‌లో దాచారు. ఇప్పుడు దానిని వేలంలో ఉంచారు.

Similar News

News January 11, 2026

పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

image

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

News January 11, 2026

ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

image

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.

News January 11, 2026

సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM), టెన్త్, 7వ తరగతి అర్హత కలిగిన వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/