News November 8, 2024
ఈ కేక్ ముక్క ఖరీదు అక్షరాలా రూ.2.40 లక్షలు
క్వీన్ ఎలిజబెత్-2 వివాహం నాటి కేక్ ముక్కను వేలం వేయగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో స్కాట్లాండ్‌కు చెందిన మారియన్ పోల్సన్ దానిని రూ.2.40 లక్షలకు కొన్నాడు. కాగా ఎలిజబెత్-ఫిలిప్ పెళ్లి 1947లో జరిగింది. అప్పటి నుంచి ఆ కేక్ పీస్‌ను భద్రంగా ఫ్రిడ్జ్‌లో దాచారు. ఇప్పుడు దానిని వేలంలో ఉంచారు.
Similar News
News December 12, 2024
‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్
AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 12, 2024
నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.
News December 12, 2024
తెలుగు సినిమా రేంజ్ ఇదే!
‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?