News August 11, 2025
దానం చేసిన దేశమే సాయం కోరుతోంది!

ISRO అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు అమెరికా దానం చేసిన చిన్న రాకెట్‌తోనే 1963లో ఇస్రో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించింది. ఇప్పుడు అదే దేశం స్పేస్ ప్రోగ్రామ్స్‌కు మన సాయం కోరుతోంది. ప్రపంచంలోనే ఖరీదైన శాటిలైట్ NISARను డెవలప్ చేయడానికి, లాంచ్ చేయడానికి NASA ఇస్రోపైనే ఆధారపడింది. ఇప్పుడు మరో భారీ <<17366188>>శాటిలైట్<<>> లాంచ్ బాధ్యతనూ ISROకే అప్పగించింది. తక్కువ ఖర్చు, సక్సెస్ రేటే ఇందుకు కారణం.
Similar News
News August 11, 2025
ఫ్రీ బస్సు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(స్త్రీ శక్తి పథకం) ఈ నెల 15నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు మహిళా కండక్టర్లు ధరించే దుస్తులకు కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది.
News August 11, 2025
భారత్‌లో టెస్లా రెండో షోరూమ్.. నేడే ప్రారంభం

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లో రెండో షోరూమ్ ఓపెనింగ్‌కు సిద్ధమైంది. గత నెల 15న ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన టెస్లా ఢిల్లీ ఎయిరోసిటీలో ఇవాళ 2PMకు రెండో స్టోర్ స్టార్ట్ చేయనుంది. షోరూమ్ ముందు <<17074330>>మోడల్ Y<<>> కార్లను ప్రదర్శించింది. V4 సూపర్‌ఛార్జింగ్ యూనిట్స్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా త్వరలో మరిన్ని సిటీలకు షోరూంలను విస్తరించే అవకాశముంది.
News August 11, 2025
సాయంత్రం భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక సూచన

TG: హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు. మ.3 గంటలకే దశలవారీగా లాగ్ ఔట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని అన్ని కంపెనీలు, ఉద్యోగులకు సూచించారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవచ్చని, ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం ఉండదన్నారు. కొన్ని రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.