News September 28, 2024

దేశ పర్యాటకం మెరుగుపడుతోంది.. కానీ!

image

2024 ప్రథమార్థంలో 4.78 మిలియన్ల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. US, బంగ్లాదేశ్ నుంచి అధికంగా వ‌స్తున్న‌ట్టు ప‌ర్యాట‌క శాఖ తెలిపింది. వ‌ర‌ల్డ్ టూరిజం డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన డేటా ప్ర‌కారం ఇది టూరిజం వృద్ధిని సూచిస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా ముందు ఉన్న ప‌రిస్థితుల కంటే వెనుక‌బ‌డిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. భార‌త టూరిజం హ‌బ్ ల‌క్ష్యాల‌ను ఇది ప్ర‌భావితం చేస్తుంద‌ని ఆ శాఖ పేర్కొంది.

Similar News

News September 29, 2024

రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా?

image

రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఫైబర్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెసరదోశ ఆరోగ్యకరమైన, పోషక అల్పాహారం. అలాగే కూరగాయలు, మొలకెత్తిన పప్పులు, కాయధాన్యాలతో కూడిన అల్పాహారం తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. గోధుమ పిండి దోశలో కూడా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పోహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు, యోగర్ట్, మిల్క్ షేక్స్ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచేలా చూస్తాయి.

News September 29, 2024

‘భాగమతి-2’ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

image

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగమతి’ సినిమా 2018లో రిలీజై హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలో దీనికి సీక్వెల్ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని డైరెక్టర్ అశోక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో అనుష్క మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తారని పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ 2025 ప్రారంభంలో మొదలు కానున్నట్లు సమాచారం.

News September 29, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ కొనసాగింపు

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2027 వరకు కొనసాగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. 2027 సీజన్ అయ్యాక ఆ తర్వాత కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్‌ను తొలిసారి 2023 సీజన్‌లో అమలు చేశారు. దీని ప్రకారం మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ 11లో ఉన్న ఓ ప్లేయర్‌ను మరో ఆటగాడితో రీప్లేస్ చేసి ఆడించవచ్చు.