News September 28, 2024
దేశ పర్యాటకం మెరుగుపడుతోంది.. కానీ!
2024 ప్రథమార్థంలో 4.78 మిలియన్ల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. US, బంగ్లాదేశ్ నుంచి అధికంగా వస్తున్నట్టు పర్యాటక శాఖ తెలిపింది. వరల్డ్ టూరిజం డే సందర్భంగా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది టూరిజం వృద్ధిని సూచిస్తున్నప్పటికీ కరోనా ముందు ఉన్న పరిస్థితుల కంటే వెనుకబడినట్టు స్పష్టం అవుతోంది. భారత టూరిజం హబ్ లక్ష్యాలను ఇది ప్రభావితం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది.
Similar News
News October 7, 2024
HEADLINES
✒ మానవాళి ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అత్యవసరం: మోదీ
✒ ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: రేవంత్
✒ ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు: భట్టి
✒ వైసీపీ హయాంలో పర్యాటక శాఖ నాశనమైంది: మంత్రి కందుల
✒ ఉమెన్స్ టీ20 WCలో పాక్‌పై భారత్ గెలుపు
✒ బంగ్లాతో తొలి టీ20లో టీమ్ ఇండియా విజయం
News October 7, 2024
వామ్మో.. యువతి పొట్టలో 2 కిలోల జుట్టు!
UPలోని లక్నోలో ఓ యువతి(21) పొట్ట నుంచి వైద్యులు 2 కిలోల జుట్టును సర్జరీ ద్వారా తొలగించారు. గడచిన 16 ఏళ్లుగా ఆమె తన జుట్టు తనే పీకేసి తినేస్తోందని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రికోఫేగియా లేదా రపంజెల్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తామని వివరించారు. పొట్టలోపల మొత్తం మాత్రమే కాక పేగుల్లోకి కూడా జుట్టు చుట్టుకుందని పేర్కొన్నారు. తరచూ వాంతులవుతుండటంతో పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు.
News October 7, 2024
అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు
అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.