News August 29, 2024
26 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ విల్ పుకోస్కి 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించారు. అనారోగ్య కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశానికి చెందిన ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. అతడికి ఎన్నోసార్లు తలకు గాయమైందని, వైద్య నిపుణుల ప్యానెల్ సూచనతో క్రికెట్ నుంచి తప్పుకున్నారని తెలిపింది. 2020-21లో టీమ్ ఇండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుకోస్కి 72 రన్స్ చేశారు.
Similar News
News October 23, 2025
APPLY NOW: CERCలో ఉద్యోగాలు

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) 9 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, డిప్లొమా, CA, MA, ఎంబీఏ, పీజీడీఎం, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: http://cercind.gov.in/
News October 23, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

టీమ్ ఇండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్షా, కారే, కొన్నోలీ, ఓవెన్, బార్ట్లెట్, స్టార్క్, జంపా, హేజిల్వుడ్.
News October 23, 2025
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

బిహార్ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.