News August 29, 2024
26 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ విల్ పుకోస్కి 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించారు. అనారోగ్య కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశానికి చెందిన ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. అతడికి ఎన్నోసార్లు తలకు గాయమైందని, వైద్య నిపుణుల ప్యానెల్ సూచనతో క్రికెట్ నుంచి తప్పుకున్నారని తెలిపింది. 2020-21లో టీమ్ ఇండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుకోస్కి 72 రన్స్ చేశారు.
Similar News
News September 10, 2024
ఇండియాలో iPhone16 ఫోన్ల తయారీ: అశ్వినీ
యాపిల్ నుంచి రిలీజైన iPhone 16 సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త డిజైన్, ఫీచర్స్ ఐఫోన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. అయితే, ఈ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు భారత కర్మాగారాల నుంచి ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
News September 10, 2024
రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
AP: వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ రూ.2 కోట్లు, సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.
News September 10, 2024
విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఇటీవల సీపీఎం ప్రకటించింది. తాజాగా మళ్లీ విషమంగా మారింది.