News October 15, 2024

‘నోబెల్’ను తెచ్చిపెట్టిన సైకిల్!

image

భారతరత్న అమర్త్య సేన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘నోబెల్’ ట్విటర్‌లో పంచుకుంది. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందడంలో ఆయన సైకిల్ కీలక పాత్ర పోషించిందని తెలిపింది. ‘మగ, ఆడపిల్లల మధ్య తేడాలపై పరిశోధన చేసేందుకు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌పైనే తిరిగేవారు. పిల్లల బరువును తానే స్వయంగా కొలిచేవారు. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో ఆయన సహాయం చేశారు’ అని నోబెల్ పేర్కొంది.

Similar News

News November 9, 2024

ట్రంప్ ఇంట్లో US సీక్రెట్ ఏజెన్సీ Robotic dogs

image

US సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ డొనాల్డ్ ట్రంప్ భద్రతను మరింత పెంచింది. ఫ్లోరిడాలోని ఆయన నివాసం వద్ద రోబో డాగ్స్‌ను మోహరించింది. వాటిపై ‘DO NOT PET’ అని వార్నింగ్ రాసుంది. రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ రోబోల్లో సర్వైలెన్స్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ సైతం చేపట్టగలవని సమాచారం. ట్రంప్‌పై 2 సార్లు హత్యాయత్నం జరగడం, ఇంకా ముప్పు ఉండటంతో ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

News November 9, 2024

హిట్ మ్యాన్ రికార్డును సమం చేసిన సంజూ

image

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ శతకం బాది రికార్డుల మోత మోగించారు. ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్‌గా సంజూ (10) నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (10) రికార్డును ఆయన సమం చేశారు. అలాగే టీ20ల్లో రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

News November 9, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం

image

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.