News November 19, 2024
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

JEE అడ్వాన్స్డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.
Similar News
News December 20, 2025
మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.
News December 20, 2025
AIIMS న్యూఢిల్లీలో ఉద్యోగాలు

<
News December 20, 2025
అసలైన పుణ్యం అంటే ఇదే..

పుణ్యమంటే నదుల్లో స్నానాలు, ఉపవాసాలు కాదు. ఇవన్నీ మనసును నిర్మలం చేసుకునే సాధనలు మాత్రమే. హృదయంలో దయ, ఎదుటివారికి సాయం చేసే గుణం లేనప్పుడు ఏ పూజ చేసినా ఫలితం ఉండదు. ఆత్మశుద్ధి లేకుండా చేసే పనుల వల్ల పుణ్యం రాదు. పరమాత్మ మనలోనే ఉన్నాడని గుర్తించి, హృదయ పరిశుద్ధతతో మెదలడమే అసలైన పుణ్యం. స్వార్థం వీడి, సాటి మనుషుల పట్ల కరుణ చూపాలి. అప్పుడే మన పనులకు సార్థకత లభిస్తుంది. అప్పుడే పుణ్యాత్ములం అవుతాం.


