News March 5, 2025
కూటమి మద్దతు అభ్యర్థి ఓటమి వారికి చెంపపెట్టు: UTF

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన UTF అభ్యర్థి ఓడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆ సంఘం ఖండించింది. UTFకు రాజకీయాలు అంటగట్టడం సరికాదంది. APTF, PRTU అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించింది. కూటమి మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టు అని పేర్కొంది.
Similar News
News March 23, 2025
మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్‌ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్ 26,98,668 స్కోర్‌తో టాప్‌లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.
News March 23, 2025
పంట నష్టం అంచనా వేయండి: అచ్చెన్న

AP: రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అలాగే అన్నదాతలకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
News March 23, 2025
ఎప్పుడూ నైటీలో ఉండమంటున్నారు.. ఓ భార్య ఫిర్యాదు!

భర్త, అత్తమామలు తనను రోజంతా నైటీయే వేసుకుని ఉండాలని వేధిస్తున్నారంటూ అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ(21) పోలీసుల్ని ఆశ్రయించారు. 2023 మేలో పెళ్లైందని, అప్పటి నుంచీ అత్తింటి కుటుంబం వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త మద్యానికి బానిసై హింసిస్తున్నారని, అతడికి అత్తామామలు అండగా ఉన్నారని తెలిపారు. కలిసుండేందుకు తాను ప్రయత్నించినా భర్త వదిలేశారని, అతడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు.